కర్నూలు నగరంలోని బుధవారపేటలోని సాయి అనాధ ఆశ్రమాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, కమిటీ సభ్యులు కలిసి తనిఖీ చేశారు. రికార్డుల గైర్హాజరు, పరిశుభ్రత లోపంపై సిబ్బందిని మందలించి, పరిశుభ్రత పాటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడాన్ని తప్పుపట్టి, మెరుగైన నిర్వహణ సూచనలు ఇచ్చారు. ఆశ్రమంలో నిరాశ్రయులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.