కర్నూలు: ఆసుపత్రి వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

81చూసినవారు
కర్నూలు: ఆసుపత్రి వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
కర్నూలులోని జొహరాపురం రోడ్డులో అశ్విని ఆసుపత్రి సమీప ఫుట్‌పాత్‌పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడిని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వయస్సు 40 ఏళ్లు, నీలం రంగు చొక్కా, ముదురు నీలం ప్యాంటు ధరించి ఉన్నాడు. తెలిసిన వారు 9121101061కి సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్