కర్నూలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

56చూసినవారు
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సందీప్ (18) మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పెయింట్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న సందీప్ స్టాక్ కోసం ఆటోలో బయలుదేరగా, అపోలో టైర్ షాపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఛాతీపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్