అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న 5వేల పారిశుద్ధ్య కార్మికులతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 21న నిర్వహించే యోగా వేడుకల్లో 10.65 లక్షల మంది పాల్గొననున్నట్లు చెప్పారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 14న రిహార్సల్ నిర్వహించనున్నారు.