కర్నూలు నగరంలోని సాయి వైభవ నగర్‌లోని ఆర్టీసీ 2వ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. మనవడికి చికిత్స నిమిత్తం హైదరాబాదు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి 42 తులాల బంగారం, రూ. 50 వేలు అపహరించారు. పనిమనిషి చూసి యజమానికి సమాచారం అందించింది. దీంతో వారు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శేషయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.