ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం 2. 0 కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కర్నూలులో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో మెగా పీటీఎం 2. 0 ను విజయవంతంగా నిర్వహించాలని శనివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పేరెంట్-టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థి పురోగతిని చర్చించి, తల్లిదండ్రులతో సంబంధాలు బలోపేతం చేయాలన్నారు.