ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌కి కనీస వేతనం రూ. 26, 000 చెల్లించాలని, సకాలంలో జీతాలు, 8 గంటల పని, పీఎఫ్-ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని కర్నూలు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు.