మంత్రి బీజీ జనార్ధన్ రెడ్డి ఆదివారం బనగానపల్లె నుంచి కర్నూలు వెళ్తుండగా ఓర్వకల్లు వద్ద పాణ్యం-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది గమనించిన మంత్రి కాన్వాయ్ ఆపారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి వైద్యం అందించాలని సూచించారు. హైవేల్లో ప్రమాదాలు తగ్గాలంటే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.