రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలులో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యావాదాలు తెలుపుతూ, ఫ్లెక్సీకి మంత్రి భరత్ పాలాభిషేకం చేశారు. ఇసుక ఉచితంగా అందరికి అందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.