రాష్ట్రస్థాయి 50వ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కబడ్డీ పోటీలు శుక్రవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. పోటీల నిర్వహక చైర్మన్ కేఈ ప్రభాకర్ అధ్యక్షతన జరుగుతున్నాయి. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు పాల్గొన్నారు.