కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో ఫీజు పోరు వాయిదా

84చూసినవారు
కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో ఫీజు పోరు వాయిదా
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మార్చి 12న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ఫీజు పోరును చేపడుతుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం మొదట ఈనెల 5న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా, అది వాయిదా పడింది. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిరసనలో భాగంగా పాల్గొనాలని పార్టీ నాయకులు సూచించారు.

సంబంధిత పోస్ట్