కర్నూలు: హనుమాన్ విజయ శోభయాత్రను ప్రారంభించిన ఎంపీ

82చూసినవారు
కర్నూలు: హనుమాన్ విజయ శోభయాత్రను ప్రారంభించిన ఎంపీ
కర్నూలు నగరంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు శనివారం హనుమాన్ విజయ శోభయాత్రను ప్రారంభించారు. కాషాయ జెండాలతో ఈ యాత్ర విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో లాలితాపీఠం నుంచి ప్రారంభమైంది. ఎంపీ నాగరాజు హనుమాన్ విగ్రహానికి పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. యాత్రకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్