కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సోమవారం ఢిల్లీలోని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు అభివృద్ధిపై చర్చించగా, కర్నూలు నుంచి బళ్ళారి వరకు జాతీయ రహదారిని నిర్మించాలని ఎంపీ సూచించారు. మంత్రి గడ్కరీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ నాగరాజు తెలిపారు.