కర్నూలు ఆసుపత్రి అభివృద్ధిపై కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మంత్రి టీ. జి భరత్‌తో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని, ఎంపీ ల్యాడ్స్ నిధులతో అంబులెన్స్ ఇస్తానని తెలిపారు. ఫార్మసీ, ఫోరెన్సిక్, క్యాంటీన్, పర్యావరణం బలోపేతంపై చర్యలు తీసుకోవాలన్నారు. కుక్క, పాముకాటుకు మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.