కడప జోన్-4 పరిధిలో 15 ఫార్మాసిస్టు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు కడప రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి. రామగిడ్డయ్య శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు నమూనా, ఇతర వివరాలను Http: //cfw. ap. gov. in వెబ్సైట్ లో ఉంచామని, అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని, 17లోపు రీజనల్ డైరెక్టర్, వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం, కడప అందజేయాలన్నారు.