కర్నూలు స్టేడియంలో శనివారం ఒలంపిక్ డే రన్ లోగోను ఘనంగా ఆవిష్కరించారు. ఈనెల 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు పాలూరి చౌదరి ప్రారంభించారు. ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, అడ్వకేట్ శ్రీధర్ రెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యుడు జి. సురేంద్ర, జిల్లా బార్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో స్పూర్తి పెంపొందుతుందన్నారు.