ఉల్లికి న్యాయమైన గిట్టుబాటు ధర ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు మార్కెట్లో వ్యాపారుల సిండికేట్ ను అరికట్టాలని కోరారు. బుధవారం కర్నూలులో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల కోసం పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదన్నారు.