కర్నూలు మండలం గొందిపర్ల ఆల్కాలీస్ ఫ్యాక్టరీలో రసాయన విస్తరణపై ప్రజలకు సమాచారం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపడం ప్రమాదకరమని ప్రజాసంఘాలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలులోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం (పీసీబీ) వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం ఈఈకి వినతిపత్రం సమర్పించారు. పర్యావరణం, ప్రజల భద్రత కోసం పరిశీలన అవసరమని నేతలు రామకృష్ణారెడ్డి, రాధాకృష్ణ తదితరులు పేర్కొన్నారు.