జూలై 10న కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశపు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ లోని మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం సంబంధించి నియోజకవర్గ, మండల స్పెషల్ అధికారులతో, ఎంపిడిఓలతో, మండల విద్యాశాఖ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు.