కర్నూలు: అవుట్ సోర్సింగ్ లస్కర్లను పర్మినెంట్ చేయాలి

79చూసినవారు
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం అవుట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్నూలులోని స్థానిక జలమండలి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమ మరణం అనంతరం ఉద్యోగాలు పిల్లలకు ఇచ్చేందుకు వీలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్