కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి సూచించారు. శుక్రవారం కర్నూలు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా చేపట్టి జిల్లాను సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు.