కర్నూలు: 104 సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించండి

70చూసినవారు
కర్నూలు: 104 సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించండి
కర్నూలులో 104 ఉద్యోగుల సమావేశం జరిగింది. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులో 104 రాష్ట్ర సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు, ఖాళీలలో నియామకాలు చేయాలని కోరారు. వాహనాల మరమ్మతులు, గ్రీవెన్స్ మీటింగ్‌లు నిర్వహించాలని, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్