కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో, పబ్లిక్ ప్రదేశాలలో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసి, ప్రజలు వాటిని స్కాన్ చేసి మాదక ద్రవ్యాలపై సమాచారం అందించనచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిపై అవగాహన పెంచి, అవి నివారించేందుకు సహాయపడగలరన్నారు.