తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల పట్ల జగన్ వ్యహరించిన తీరు బాధాకరమని, ఆయనను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారని కుడా చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్, ఆయన చెంచాగాళ్లు భక్తుల పట్ల వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు.