ప్రభుత్వ నిర్లక్ష్యమే విమానం కూలిపోవడానికి కారణమైందని కర్నూలు కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ జిలాని బాషా శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల స్మరణార్థం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసి, పీజీ మెడికల్ విద్యార్థులు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.