కర్నూలు: పాకెట్ పార్కు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

55చూసినవారు
కర్నూలు: పాకెట్ పార్కు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ సమీప హంద్రీ నది ఒడ్డున డంప్ తొలగించి నిర్మిస్తున్న పాకెట్ పార్కును త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ యస్. రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కర్నూలులో మాట్లాడుతూ రూ. 10 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతోందని, ఫెన్సింగ్, గ్రావెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పచ్చదనం పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ పారిశుద్ధ్య పనులు కూడా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్