కర్నూలు నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ నది ఒడ్డున డంప్ తొలగించి నిర్మిస్తున్న పాకెట్ పార్కు త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాకెట్ పార్కు పనులు పరిశీలించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు, హంద్రీ నది ఒడ్డున ఉన్న డంప్ తొలగించామని, ఆ స్థానంలో రూ. 10 లక్షలతో పాకెట్ పార్కు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.