కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారపేటలోని శ్రీవిజయ పబ్లిక్ స్కూల్లో అదే కాలనీకి చెందిన 8వ తరగతి విద్యార్థి పట్ల హెచ్ఎం అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఈ విషయంపై బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్ వద్దకు చేరుకొని సదరు హెచ్ఎంను పట్టుకొని మూడవ పట్టణ పోలీసులకు అప్పగించారు.