పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ్ పక్వాడ లక్ష్యమని కర్నూలు జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోషణ పక్వాడ కార్యక్రమని నిర్వహించారు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు వారి ఆరోగ్యం పట్ల వహించాల్సిన శ్రద్ధ, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సరైన చర్యలు గురించి అవగాహన కల్పించడమే పోషణ పక్వాడ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.