ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థల్లో పనిచేసే సిబ్బందికి చట్టబద్ధమైన జీతాలు, సెలవులు, ఉద్యోగ భద్రత అమలు చేయాలని బుధవారం కర్నూలులో నౌషాద్ బాషా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలు సామాన్యులను దోచుకుంటున్నాయి, అందరికీ సమాన జీతాలు, మెరుగైన వేతన విధానం అవసరమని సూచించారు. విద్యా, వైద్య రంగాల్లో నాణ్యత పెరిగే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.