రాయలసీమ వర్సిటీలో ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు, మహిళ సంఘాల ఐక్యవేదిక నాయకులు శేషఫణి, పట్నం రాజేశ్వరి, విజయలక్ష్మి శ్రీనివాసులు, సీమకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం వర్సిటీలో ఉపకులపతి, రిజిస్ట్రార్‌లకు వినతిపత్రం సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడ్డారని, యూనివర్సిటీ భూములు అక్రమంగా అప్పజెప్పారని ఆరోపించారు.