కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంగళవారం 16 మంది పంచాయతీ సిబ్బందికి పదోన్నతులు లభించాయి. కర్నూలులో 8 మంది, నంద్యాలలో 8 మందికి ప్రమోషన్ ఇచ్చారు. వారిలో 11 మంది గ్రేడ్-4 కార్యదర్శులలో 9 మందికి రెగ్యులర్, 2 మందికి అదనపు పదోన్నతులు కల్పించారు. అలాగే 4 మంది గ్రామ సిబ్బందికి, డీపీఓ కార్యాలయ సిబ్బందిలో ఒకరికి గ్రేడ్-3 ప్రమోషన్ మంజూరయ్యింది. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు.