ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం పాఠశాలల బలోపేతం, రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నియోజకవర్గ స్పెషల్ అధికారులతో, డిప్యూటీ విద్యాశాఖాధికారులతో, కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.