మహిళల రక్షణపై కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ, రాష్ట్ర కార్యదర్శి కల్లా నాగవేణిరెడ్డి ఆరోపించారు. మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల భద్రతపై కనిపించడం లేదని వారు అన్నారు. మంగళవారం కర్నూలులో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.