కర్నూలు: జూన్ 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

62చూసినవారు
కర్నూలు: జూన్ 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో జూన్ 16 (సోమవారం) ఉదయం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం 1100 కాల్ సెంటర్ నంబర్ ద్వారా, Meekosam.ap.gov.in వెబ్‌సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్