ఈనెల 14వ తేదీన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి (ప్రభుత్వ సెలవు) సందర్భంగా కర్నూలు నగరంలో కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దు చేశామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ప్రకటించారు. ప్రజలు ఈ విషయంలో గమనించి అర్జీలు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు.