తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం చట్టరీత్యానేరమని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అన్నారు. గురువారం కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ పై అధికారులతో చర్చించారు. ముందుగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ, కమిటీ సభ్యులు, ఎస్సై జె. మన్మథవిజయ్ తో మాట్లాడారు. మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థుల తరగతి గదికి వెళ్లి ర్యాగింగ్ పై సంఘటన గురించి విచారించారు.