కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగపు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ, కుటమి ప్రభుత్వ పాలనలో రైతు వ్యతిరేక విధానాలను ఖండించి, ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతానని తెలిపారు. రైతులకు రూ. 20వేలు ఆర్థిక సహాయం, పంటల బీమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.