స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలంటూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసుల ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో వినతిపత్రం అందించారు. బెట్టింగ్ యాప్ల వల్ల యువకులు అప్పుల్లో కూరుకుని ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్‌కు ప్రోత్సాహమిచ్చే స్పాన్సర్‌షిప్ ప్రకటనలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిషేధించాలని కోరారు.