కర్నూలు: రేపు జిల్లాలో 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

78చూసినవారు
కర్నూలు: రేపు జిల్లాలో 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
కర్నూలు జిల్లాలో శనివారం 17 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శుక్రవారం తెలిపారు. ఆదోని డివిజన్‌లో పెద్దనెలటూరు, చిన్నకోటిలికి, సోగనూరు, పల్లిపాడు, చూడి, సింగరాసిన హళ్లి, కంబదహాల్, గోనబాయి, మడిలింగడహళ్లి గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కర్నూలు డివిజన్‌లో పెద్ద టేకూరు, గార్గేయపురం, చక్రాల, మానెగుంట, కురువల్లి, కారుమంచి గ్రామాల్లో నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్