కర్నూలు నగరంలో 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా మంగళవారం గుడ్ సమారిటన్ కార్యక్రమం నిర్వహించారు. డిటిసి ఎస్ శాంత కుమారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారి హక్కుల గురించి వివరిస్తూ, ప్రభుత్వ చట్టాలను అమలు చేయాలని సూచించారు. బాధితులను ఎవరూ వేధించకూడదని, సహాయం చేసిన వారికి గౌరవప్రదంగా రూ. 5000 పారితోషికం అందించాలన్నారు.