ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం అని, రూ. 1. 4 కోట్లతో విజయవనం అభివృద్ధి చేయడం జరుగుతోందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి వద్ద విజయవనంలో అటవీశాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవంలో కలెక్టర్ తో పాటు జేసీ నవ్య పాల్గొని మాట్లాడారు. విజయవనం పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతోందన్నారు.