ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండల పరిషత్ లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3, 4 క్వార్టర్లకు రూ. 7, 71, 76, 217లను విడుదల చేసిందని జడ్పీ సీఈవో నాసరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో తలసరి గ్రాంట్ కింద రూ. 1, 52, 35, 944, సీనరేజ్ గ్రాంట్ కింద రూ. 3, 93, 44, 687, ఎంపీటీసీల గౌరవ వేతనాలకు రూ. 2, 25, 95, 586లను విడుదల చేశారన్నారు.