షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ త్వరగా చేయాలని ఏపీ ఎమార్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. గురువారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఉపకులాల ఏకసభ్య కమిషన చైర్మన రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో భైరాపురం రాజు, సుధాకర్, ప్రతాప్, పూలరాజు, సూరిబాబు, సోల్మాన, విహార్, రాజశేఖర్, సుజాత, అయ్యమ్మ పాల్గొన్నారు.