కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్స్‌కు కొత్త వేతనాలు ఇప్పించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. శనివారం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించి, కొత్త ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ గార్డులకు రూ. 18600 కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు, మేటర్నిటీ సెలవులు అమలు చేయాలని, జూన్ 1 నుండి వేతనాలు పెంపుని కోరారు. గత బకాయి జీతాలు, పిఎఫ్ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.