కర్నూలు: ఐదు ప్రత్యేక బృందాలతో విత్తనాల తనిఖీ

74చూసినవారు
కర్నూలు: ఐదు ప్రత్యేక బృందాలతో విత్తనాల తనిఖీ
కర్నూలు జిల్లా వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం పత్తి, ఇతర పంటల విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని శనివారం జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం. బీటీ పత్తి విత్తనాలను దృష్టిలో ఉంచుకొని ఐదు బృందాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్