కర్నూలు: ఎఆర్ ఎస్ఐ ని సత్కరించిన ఎస్పీ బిందు మాధవ్

64చూసినవారు
కర్నూలు: ఎఆర్ ఎస్ఐ ని సత్కరించిన ఎస్పీ బిందు మాధవ్
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో విశేషంగా సేవలందించి పదవీ విరమణ పొందడం అబినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మ్ రిజర్వుడ్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఎఆర్ ఎస్ఐ జి. వి. సుబ్బారెడ్డిని ఎస్పీ శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పోలీసుశాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ క్రిష్ణ మోహన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్