ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానంపై సర్వే నిర్వహిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివో లతో సమావేశం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ ద్వారా 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని, ఎంపీడీవోలను మండల స్థాయిలో సమాధానాలు సేకరించమని ఆదేశించారు.