వేసవికాలం సమీపిస్తున్న దృష్ట్యా కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్ర బాబు వెల్లడించారు. ఆదివారం ఆయన అశోక్ నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన చర్యలను ముమ్మరం చేయాలని, ఒకవేళ ఏర్పడినా తక్షణ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.