కర్నూలు: కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు

85చూసినవారు
కర్నూలు: కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు
సంక్రాంతి పండగను పురస్కరించుకొని కర్నూలు జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు ఇతర ప్రాంతాల్లో కోడి పందేలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేదమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా, సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్